Monday, December 23, 2024

అయోధ్యలో రాముడి గర్భగుడి ఇదే

- Advertisement -
- Advertisement -

ఫొటోలు విడుదల చేసిన రామజన్మ భూమిట్రస్ట్
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయం ప్రారంభోత్సవ వేడుక జరుగనున్నది. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఫోటోలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ విడుదల చేశారు. సోషల్ మీడియా సైట్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా విడుదల చేయగా.. వైరల్ అయ్యాయి. శ్రీరామచంద్రమూర్తి ఆలయ మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి సైతం దాదాపు సిద్ధమైందని, ఇటీవల లైటింగ్ పనులు సైతం పూర్తయినట్లు చంపత్‌రాయ్ పేర్కొన్నారు. మరో వైపు జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభంకానున్నది. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని నరేంద్ర మోడీ సహా 130 దేశాల ప్రతినిధులు హాజరవనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News