Friday, December 27, 2024

ఇదీ కెసిఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి

- Advertisement -
- Advertisement -

మంత్రి కెటిఆర్ ఆసక్తికర ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్: నీటి కోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారమవుతున్నదని మంత్రి కెటిఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవిష్కృతమవుతున్నదని, తెలంగాణ జల విజయ పతాకం సగర్వంగా ఎగురుతున్నదని చెప్పారు. తెలంగాణ సాగు నీటి రంగంలో పిఆర్‌ఎల్‌ఐ మరో కాళేశ్వరమని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అవాంతరాలను, అడ్డంకులను అధి గమిస్తూ.. కుట్రలను, కేసులను గెలుస్తూ జలసంకల్పంతో అనుమతులు సాధించామన్నారు. దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్నదని తెలిపారు. బిరబిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్లందించనున్నదని చెప్పారు. ఇది తెలంగాణ జలశక్తి అని, కెసిఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి అని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

Project 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News