Sunday, January 19, 2025

ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో

- Advertisement -
- Advertisement -

కర్ణాటక వీడియోతో కాంగ్రెస్ పై కెటిఆర్ పంచ్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న అధికారులపై ఆగ్రహంతో రైతన్నలు ఏకంగా సబ్‌స్టేషన్‌కు మొసలిని పట్టుకొచ్చారు. మాకు కరెంటు ఇస్తారా? మొసలిని సబ్‌స్టేషన్‌లో వదలాలా అంటూ నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటకలోని రోణిహాల్ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ సెటైర్ వేశారు. కరెంటు కష్టాలపై మంత్రి కెటిఆర్ చేసిన రీట్వీట్‌పై నెటిజన్లు కూడా భారీగా స్పందిస్తున్నారు. ఇలాంటి పండుగలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిమితం చేద్దాం ఈ దిక్కుమాలిన పండుగలను తెలంగాణకు తీసుకురాకుండా కాంగ్రెస్, బీజేపీలను తరిమికొడదామని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కరెంటు లేక జిరాక్స్ సెంటర్ దగ్గర రెండు గంటలు కరెంటు కోసం నిలబడిన రోజులు మళ్లీ వస్తాయోమో అని ఇంకో నెటిజన్, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లే అని మరో నెటిజన్ కామెంట్లు పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News