Monday, December 23, 2024

ఆత్మగౌరవ ప్రతీక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తాము భవనాలను ఆకృతి చేస్తాం.. ఆ తర్వాత ఆ భవనాలు మనల్ని ఒక ఆకృతిలోకి తీసుకువస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయ భవనానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు విన్‌స్టన్ చర్చిల్‌కు సంబంధించిన ఒక సూక్తిని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబంగా ఉండే ఈ సచివాలయం భవిష్యత్‌లో మనకు మంచి మార్గనిర్దేశనం అవుతుందని పేర్కొంటూ హరీష్‌రావు ఈ ట్వీట్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని ఏప్రిల్ 30న సిఎం కెసిఆర్ ప్రారంభిస్తున్నట్లు హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నూతన సచివాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News