ఆళ్లపల్లి: రాయగూడెం పాఠశాలను మంగళవారం మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య సందర్శించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ స్థానిక ఉపాధ్యాయుడు కొమరం రామకృష్ణ పాఠశాలకు తరచూ గైర్హాజరు అవుతున్నాడని, గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. గతంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం రెండు పర్యాయాలు షోకాస్ నోటీసులు ఇచ్చినా అతని పద్దతిలో ఎటువంటి మార్పులేదని, మధ్యాహ్నం భోజన బియ్యాన్ని కూడా సొంతానికి వాడుకుని, పాఠశాల నిధులను చైర్మన్‌కు తెలియకుండా వాడుకుని పాఠశాలకు ఎటువంటి సామాగ్రి కొనడం లేదని, పిల్లలకు కనీస పరిజ్ఞానం కూడా రావడం లేదని గ్రామాస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడు మాకు వద్దు అని గ్రామస్తులు అందరూ ఎంఈవోకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన అధికారి ఈ విషయంపై డిఈవోకి నివేదిక పంపడం జరగుతుందని తెలిపారు. రామకృష్ణను ఆళ్లపల్లి పాఠశాలకు తాత్కాలికంగా పంపడం జరుగుతుందని చెప్పారు. అప్పటి వరకు వేరే పాఠశాల ఉపాధ్యాయుడిని ఈ పాఠశాలకు పంపిస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఉపాధ్యాయుడు మాకొద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -