భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవత్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవత్ రావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 3 లక్షల విగ్రహాలను ప్రతిష్టించారని, ఈసారి సుమారు 3.5 లక్షల గణేశ్ విగ్రహాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే గణేశుని విగ్రహ ప్రతిష్టాపనకు పది రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మట్టి గణపతుల పంపిణీ
గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ ఎంసి, హెచ్‌ఎండిఏ, టిఎస్ పిసిబి వంటి ప్రభుత్వ సంస్థలు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. హెచ్‌ఎండిఏ దాదాపు లక్ష మట్టి గణపతులు, పిసిబి 75 వేలు, 150 డివిజన్‌లలో జీహెచ్‌ఎంసి 3 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. పర్యావరణ పరిక్షణకోస ఈ మట్టి గణేష్ విగ్రహాల తయారీలో సహజసిద్ధమైన కలర్స్‌ను వినియోగించడం విశేషం.