Thursday, March 20, 2025

ఈసారి అనుకున్నది సాధిస్తాం : హార్థిక్ పాండ్యా

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్థిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ హార్థిక్ పాండ్యా బదులుగా సూర్యకుమార్ యాదవ్ చేస్తాడు. అయితే జట్టులో ముగ్గురు కెప్టెన్లు ఉండటం తనకు అదనపు బలాన్ని ఇచ్చిందని హార్థిక్ స్పష్టం చేశాడు. వివిధ ఫార్మాట్‌లలో కెప్టెన్సీ చేసిన వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకొని అంతిమంగా జట్టును విజేతగా నిలుపుతానని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అడిన అనుభవంతో తన ఈసారి తాను రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానని.. అభిమానుల నుంచి కూడా సానుకూల స్పందన కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అభిమానులు టాస్‌కి వెళ్లినప్పుడు చీర్ చేయాలని.. సిక్స్ కొట్టినప్పుడు గట్టిగా అరవాలని.. వాంఖడే స్టేడియంలో ముంబయి రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దని హార్థిక్ అభిమానులకు పిలుపునిచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News