Sunday, November 3, 2024

ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు

- Advertisement -
- Advertisement -
this year is a modest ugadi celebration in telangana
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈసారి ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టివిల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉగాది పంచాంగం ఆవిష్కరణ

బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి దేవస్థానం ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News