Monday, December 23, 2024

ఈ ఏడాది మా సంకల్పం ‘రైతు-మహిళ-యువత’

- Advertisement -
- Advertisement -

ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలి, అందరి ఆకాంక్షలు నెరవేరాలి

ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

బంగారు భవిష్యత్తు కోసం కృషిచేద్దాం : బిఆర్‌ఎస్
అధినేత కెసిఆర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్ర జలు అందరు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల అందరికి కొత్త సంవ్త్సరం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సిఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని, కొత్త సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని ఆ కాంక్షించారు. 2023లో నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగిపోయాయ ని, అందరి సహకారంతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామన్నారు. 2024ను ‘రైతుమహిళయువత’ నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. 2024లో ప్రతి ఇంటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని భట్టి ఆకాంక్షించారు. అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుంది హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి జూపల్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టై శ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని, సంపద, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు మంత్రి జూపల్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖఃసంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని, సంపద, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ సిఎం కెసిఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలన్నారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయా లు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

2024 నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు,సిరిసంపదలతో ప్రజ లు జీవించాలని ఆయన ఆకాంక్షిచారు. 2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ,2024 నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామన్నారు. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు డిజిపి రవిగుప్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల శాం తి, భద్రత, సంక్షేమం కోసం నిబద్ధతతో కృషి చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News