Monday, December 23, 2024

తొలకరి పలకరించింది.. పుడమి పులకరించింది

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కారేపల్లి మండల వ్యాప్తంగా గురువారం రాత్రి తొలకరి వర్షం పలకరించింది. దీంతో పుడమి పులకరించింది. వర్షం రాకతో రైతులు హర్షం వెలిబుచ్చారు. ఎప్పటి నుండో వరుణుడి కరుణ కోసం, వర్షం రాక కోసం ఆబగా ఎదురుచూస్తున్న రైతన్నల కళ్ళలో కోటి కాంతులు మెరిసాయి.

దీంతో శుక్రవారం రైతన్నలు నాగళ్ళు చేతబట్టి, ఇదివరకే చెత్తాచెదారం ఏరి, శుభ్రం చేసుకున్న చేలలో ఏరువాక సాగారో రన్నో, రైతన్నో అంటూ పాటలు పాడుకుంటూ దుక్కులు దున్నుకుంటూ వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సరికే వర్షాలు కురిసి, విత్తులు విత్తాల్సి ఉండగా, వరుణుడి కరుణ లేక వర్షం రాకపోవడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చిందని, వర్షం రాకతో వ్యవసాయ పనులను ప్రారంభించామని తెలిపారు.

కాగా గత నాలుగు నెలలుగా ఎండ వేడిమి, ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు భరించలేక, ఇళ్లలో నుండి బయటకు రావడానికి జంకిన జనం, తప్పనిసరై ఎండలో ప్రయాణిస్తూ విలవిలలాడిన మండల ప్రజలు గురువారం రాత్రి కురిసిన వర్షంతో, వాతావరణం చల్లబడడంతో ఎండ వేడిమి నుండి కాస్త ఉపశమనం పొందారు. కాగా మండలంలోని పేరుపల్లి, కారేపల్లి తదితర గ్రామాలలో గురు, శుక్రవారాలు, మహిళలు, యువకులు వర్షం కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ కప్పలకు పెళ్లిళ్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News