Friday, December 20, 2024

ఆ ఊరు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలోనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల జిల్ల మేడిపల్లి మండలం తోంబర్రావు పేట గ్రామంలోని పిల్లంతా  ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఈ బడిలో 1 నుంచి 5 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. గత 8 సంవత్సరాల క్రితం 11 మంది పిల్లలతో మూతపడే స్థాయిలో ఉన్న పాఠశాలను ఉపాధ్యాయులు గ్రామస్థుల సహకారంతో నేడు ఆదర్శ పాఠశాల గా నిలిపారు. గ్రామంలోని చిన్నారులకు ప్రైవేటు పాఠశాలంటే ఎంటో తెలియదు,కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశలలోనే మంచి విద్య లభించడంతో గ్రామస్థులంతా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 104 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల మండలంలోనే ఆదర్శంగా నిలించింది. ఆ పాఠశాలలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News