Wednesday, January 8, 2025

9 నుండి 17వ తేదీ వరకు తొండమాన్పురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 9 నుండి 17వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 8న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, 9న ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

10న హంస వాహనం, 11న సింహ వాహనం, 12న హనుమంత వాహనం, 13న సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ, 14న గజవాహనం,15న చంద్రప్రభ వాహనం, 16న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.మార్చి 17న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. మార్చి 18న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News