Thursday, January 23, 2025

తొర్రూరు బస్సులో ఉరేసుకున్న కండక్టర్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఆర్‌టిసి కండక్టర్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్‌టిసి డిపోలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 1993లో గార్లపాటి మహేందర్ రెడ్డి(54) ఆర్‌టిసిలో కండక్టర్‌గా చేరారు. తన గ్రామం కంఠాయపాలెం కావడంతో తొర్రూరులోనే ఇల్లు నిర్మించుకొని తన భార్య అరుణ, ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.

మూడు రోజుల నుంచి మహేందర్ రెడ్డి సెలవులో ఉన్నాడు. ఆదివారం 12 గంటలకు డీపోలకు వచ్చి డ్యూటీ చేస్తానని రిజిస్టర్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. తరువాత ఎవరికీ కనిపించకపోవడంతో సిబ్బంది పోన్ చేశారు. డిపో చివరన ఉన్న బస్సులో అతడు ఉరేసుకున్నట్టుగా ఆర్‌టిసి సిబ్బంది గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు నచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తొర్రూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News