Friday, April 4, 2025

తొర్రూర్ రెండో ప్రీబిడ్ మీటింగ్ విజయవంతం

- Advertisement -
- Advertisement -
Thorrur Second Prebid Meeting Succeeds
అధికసంఖ్యలో హాజరైన ఔత్సాహికులు
223 ప్లాట్లను దక్కించుకోవడానికి రియల్టర్‌ల ఆసక్తి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఆధ్వర్యంలో 223 ప్లాట్ల అమ్మకాల (ఈ-ఆక్షన్)కు సంబంధించిన రెండో దశ ప్రీ బిడ్ సమావేశం బుధవారం విజయవంతంగా ముగిసింది. దాదాపు 117 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట వెయ్యి ప్లాట్లతో రూపుదిద్దుకుంటున్న తొర్రూర్ లే ఔట్‌లో తొలిదశలో 30 ఎకరాల్లో 223 ప్లాట్ల అమ్మకాలు ఈనెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్ వేలం(ఈ- ఆక్షన్) పద్ధతిలో జరగనున్నాయి. రెండోదశ ప్రీ బిడ్ సమావేశంలో లే ఔట్‌కు సంబంధించిన వివరాలు, లే ఔట్‌లో ఏర్పాటుచేయనున్న మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణ అనుమతులు తదితర అంశాలను హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, సెక్రటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పారావులు ఔత్సాహికులకు వివరించారు. ఆన్‌లైన్ వేలం(ఈ-ఆక్షన్)లో పాల్గొనే పద్ధతులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధులు ఔత్సాహికులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలు, సందేశాలను హెచ్‌ఎండిఏ, ఎంఎస్‌టిసి అధికారులు నివృత్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఆన్ లైన్ వేలం (ఈ-ఆక్షన్) జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News