Wednesday, January 22, 2025

ఆ 55మందికి పదవులు నై!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎ లాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా స మాచారం. ఈ నేపథ్యంలోనే ఏడాది కా లం పాటు ఎంఎల్‌సిలు, నామినేటెడ్ పో స్టులు ఇవ్వరాదని స్పష్టం చేసినట్టు తెలిసిం ది. రాష్ట్రంలో 55 మందికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని టిపిసిసికి సైతం ఆదేశాలు జారీ చేసినట్టు గా సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం నుంచి సిపిఐ పోటీ చేసి గెలుపొందింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేసినా ఒకచోట మాత్రమే విజయం సాధించారు. 118 స్థానాల్లో 64 మంది మాత్రమే గెలుపొందగా మిగిలిన 55 స్థానాలను బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎంలు కైవసం చేసుకున్నాయి. అ యితే ఓటమి చెందిన 55 మంది నాయకులు ఏడాది పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఏ పోస్టులనూ ఉండరాదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్సీ పదవులు గానీ నామినేటెడ్ పదవులు గాని ఈ 55మందికి ఇవ్వకూడదని అధిష్టానం సూ చించినట్టుగా సమాచారం. మైనార్టీ ప్రజాప్రతినిధులు గెలవకపోవడంతో ఆ సామాజికవర్గంలో అర్హత కలిగిన నాయకులకు ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం సైతం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది.

100కి పైగా నామినేటెడ్ పదవులు…
అదేవిధంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన 55 మందిలో ఒక్కరికీ కూడా అవకాశం ఇవ్వొద్దని అధిష్టానం సూచించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం 100కి పైగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశలో హస్తం పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఒకసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏ నాయకుడికి తిరిగి ఏడాది వరకు ఇవ్వకూడదని, కొత్త వాళ్లను ప్రోత్సహించాలని రాష్ట్ర కాంగ్రెస్ సైతం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఆ మూడు ఎమ్మెల్సీ పదవులను అసెంబ్లీలో టికెట్లు త్యాగం చేసిన వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు పిసిసి అధ్యక్ష పదవితో పాటు, పార్టీ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసం నేతల జాబితా చాంతాడంత ఉంది. ఇందులో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నేతలతో పాటు, టికెట్లు త్యాగం చేసిన నాయకులు కూడా పదవులను ఆశిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, మరొకటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ హస్తం పార్టీ ఖాతాలో ఉన్నాయి. సిపిఐతో పొత్తు పెట్టుకున్న సమయంలో ఒక టికెట్‌తో పాటు, ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పార్టీకి ఒక సీటు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా టికెట్లు అడగకుండా పార్టీ కోసం పని చేసిన వారు ఉన్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కూడా సిఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పదవి ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకోవాలని పార్టీ అధిష్టానంం సూచించినట్లుగా సమాచారం. అయినా ఆ పదవి కోసం మాజీ ఎంపి, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్‌లు పోటీ పడుతున్నారు. మరో వైపు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ పోస్టుల కోసం కూడా పలువురు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News