Thursday, January 23, 2025

ఆ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు బిఆర్ఎస్ కే : మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముందు ఈ వ్యాఖ్యలు చేయడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సిఎం కెసిఆర్ పై ప్రజలకు నమ్మకం ఉంది కానీ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బిఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని, లేదంటే 90 సీట్లకే పరిమితం అవుతుందని అన్నారు. కొందరి ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకత పార్టీ పై ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాలేదని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News