Monday, December 23, 2024

భూ బకాసురులకు కొమ్ముకాస్తున్న వారిని సస్పెండ్ చేయాలి

- Advertisement -
- Advertisement -
  • రైతులకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం

శామీర్‌పేట: భూ బకాసురులకు కొమ్ముకాస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బొమ్మరాసిపేట రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం శామీర్ పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్, అడ్మిన్ తహసిల్దార్ భూపాల్, శామీర్‌పేట తహసీల్దార్ సత్యనారాయణలు భూ బకాసురులకు కొమ్ముకాస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు భూ బకాసురులతో కుమ్మకై పట్టాదారుల అనుమతి లేకుండా పాసుబుక్కు లు జారీ చేసేందుకు యత్నిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. క్రయవిక్రయాలలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని పట్టి ంచుకోకుండా రాత్రికి రాత్రే కొందరు దళారులకు అనుకూలంగా జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్ మార్పులు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బొమ్మరాసిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 323 నుంచి 409 వరకు 1050 భూమి ఉండగా ఇందులో 775 ఎకరాలు పట్టా భూమి ఉందని, 255 ఎకరాలు ఇనాం భూమి ఉందని 1976-77లో ఇనాం భూమికి ప్రభుత్వం నుంచి ఓఆర్‌సి ఇవ్వడం జరిగిందని తెలిపారు. 506 పట్టా భూముల్లో సు మారు 500 మంది రైతులు గత 50 ఏళ్ళ నుండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమకు ధరణి పాస్ బుక్ లు ఉన్నప్పటికీ ధరణిలోని లుసుగులను కొందరు దళారులు అడ్డుపెట్టుకొని తమ భూములను లా క్కునేందుకు యత్నిస్తున్నారన్నారు.

ధరణి లోని లొసుగులతో ప్రస్తుత పట్టాదారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తమ గోడును విన్నవించుకున్న పట్టించుకోవటం లేదని అప్పులు చేసి హై కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న ఉన్నప్పటికీ ధర ణి పోర్టల్ గురువారం రాత్రి స్లాట్లు బుక్ అయ్యేలా కలెక్టర్ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అనుమతి లేకుండానే స్లాట్ బుక్ ఏ విధంగా అ వుతాయని స్లాట్ బుక్ అయినవాటిని వెంటనే రద్దు చేయాలని తహసీల్దార్ తో రైతులు వాగ్వాదానికి దిగారు.

బొమ్మరాసిపేట రైతుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తహసిల్దార్ సత్యనారాయణ స్లాట్ బుకిం గ్ నిలిపివేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో బొమ్మరాసిపేట రైతులు రవి కిరణ్‌రెడ్డి, డాక్టర్ రామయ్య, సత్యనారాయణ రాజు, బాబుల్ రెడ్డి శ్రీనివాసరాజు, వెంకట్ రెడ్డి, పర్వతాలు, బంటు భాస్కర్, గొల్ల యాదయ్య, శ్రీను, కృష్ణ, బంటు మల్లేష్, బంటు గోపాల్, గొల్ల కిట్టు, గొల్ల శ్రీకాంత్, దయాకర్ రెడ్డి, రమేష్ ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News