మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసిన టిఎస్‌పిఈజేఏసీ నాయకులు
హైదరాబాద్ : కార్వాన్ సెక్షన్ విద్యుత్‌శాఖ సబ్ ఇంజనీర్ విజయకుమార్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని టిఎస్‌పిఈజేఏసీ(తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ) బుధవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు (టిఎస్‌పిఈఏ) మాట్లాడుతూ విజకుమార్‌పై భౌతిక దాడి వికృతమైన చర్యని అన్నారు. ఇటువంటి సంఘటలను పునరావృతం కాకుండా భౌతిక దాడి చేసనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్నారు.ఈ సంఘటనతో విద్యుత్ ఉద్యోగులు అభద్రత భావానికి లోనవుతున్నారని మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ రెడ్డి, పి. సదానందం, వెంకన్న గౌడ్, సుదాకర్ రెడ్డి, వేణుగోపాల్, కరుణాకర్ రెడ్డి, కిరణ్, అంజయ్య, నారాయణ్ నాయక్, జ్యోతీ రాణి తదితరులు ఉన్నారు.