Monday, January 20, 2025

పార్టీని నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి, పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. పాతవారిని పక్కన పెట్టి,  కొత్త వారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బిసి నాయకులు పార్టీని నమ్ముకొని ఉన్నారని వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మధుయాష్కీ అన్నారు.

ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల సీట్ల కేటాయింపు జరగలేదన్నారు. మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం సరికాదని, కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటివరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు చర్చలు జరిపారని నంది కంటి శ్రీధర్ తెలిపారు. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ కేటాయించే అంశంపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకో లేదని పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని నందికంటి శ్రీధర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News