Monday, December 23, 2024

రాజ్యాంగాన్ని అంగీకరించని వాళ్లు…

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు దేశాన్ని కబ్జాచేసి అంబానీ, అదానీల చేతుల్లో పెడుతున్నారు
సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సుభాషిని అలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగాన్ని అంగీకరించని వాళ్ళు ఇప్పుడు దేశాన్ని కబ్జా చేసి అంబానీ అదానీల చేతుల్లో పెడుతున్నారని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సుభాషిని అలీ విమర్శించారు. రైల్వేలు, స్టీల్ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ అంబానీ ఆదానీల చేతిలో పెడితే మన పిల్లలకి ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థి దశరథ్ ను గెలిపించాలని కోరుతూ శ్రీకృష్ణ కాలనీ ముషీరాబాద్‌లో బహిరంగ సభ జరిగింది.

ఈ బహిరంగ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. దేశంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటే వాళ్ల కుటుంబాలు బాగుంటాయి దేశం బాగుంటది అని కోరుకుంటూ ఇక్కడ హైదరాబాదులో అన్ని రకాల ప్రజలు కలిసిమెలిసి ఉండటాన్ని చూశానన్నారు. 26నవంబర్ ముఖ్యమైన రోజని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసిన రోజని, ఈ దేశంలో ఉన్న సంఘ పరివార్ శక్తులు ఈ రాజ్యాంగాన్ని ఆరోజు తాము అంగీకరించమని చెప్పారని, వారు కేవలం మనుస్మృతిని మాత్రమే అంగీకరిస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు వాషింగ్ మిషన్ లాగా తయారయ్యాయని విమర్శించారు.

బిజెపి పార్టీలో టికెట్ రానివారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో టికెట్ రానివారు బిఆర్‌ఎస్, బిజెపిలో చేరుతున్నారన్నారు. ఈ రకంగా పార్టీలు మారి టికెట్లు సంపాదించే లక్ష్యంతో పోటీ చేస్తున్నవారు రేపు ప్రజా సమస్యల మీద ఎలా పోరాడుతారు? అని ప్రశ్నించారు. ఒకపక్క బిజెపి ప్రభుత్వం దేశ సంపదని అమ్మేస్తుంటే ఈ పార్టీలన్నీ పోరాటం చేయకుండా అమ్మేయండి.. అమ్మేయండి.. మా టైం వచ్చాక మేము కూడా అమ్మేస్తాం అనే పద్ధతిలో వేచి చూస్తున్నారని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News