Thursday, January 23, 2025

దేవుని సొమ్ము, అటవీ సంపదను దోచుకున్న వారు బాగుపడలెరు

- Advertisement -
- Advertisement -
  • రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
  • ఖిల్లా రామాలయానికి నూతన చైర్మన్, డైరెక్టర్ ప్రమాణ స్వీకారం

డిచ్‌పల్లి : దేవుడి సొమ్ము అటవీ సంపద, ప్రకృతి వనరులు దోసుకున్న ఏ వ్యక్తి బాగుపడలేరని నిజామాబాద్ గ్రామీణ ప్రాంత శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి రామాలయానికి నూతన ఆలయ కార్యవర్గ సభ్యులు, చైర్మన్ పొద్దుటూరి మహేందర్ రెడ్డి, డైరెక్టర్స్ నల్ల నిర్మల, ఆసది జయ, కందగిరి వినోద్‌కుమార్, గట్టావలి సాగర్, ఆలయ అర్చకులు పాండే సుమిత్‌లు శుక్రవారం ఎండోమెంట్ అధికారిని ఇన్స్‌పెక్టర్ కమల సమక్షంలో, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఎండోమెంట్ ఇన్స్‌పెక్టర్ కమల చేసిన దృవపత్రాలపై సంతకాలు చేసి ఎమ్మెల్యేకు అందజేయగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రామాలయ కమిటీ డైరెక్టర్స్ పత్రాలను అందుకున్నారు. దీనికి ముందు గ్రామంలో 35 కోట్లతో గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేయించిన శంకుస్థాపన, శిలాఫలకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శ్రీసీతారామస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారామస్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు. సందర్భంగా రామాలయంపై నిర్మించిన కల్యాణ మండలంకు చేరుకొని నూతనంగా ఎకరం చేసిన చైర్మన్, డైరెక్టర్స్‌లకు ఎమ్మెల్యే బాజిరెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు మీవంతు కృషి చేయాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చెడ్డపేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకొని, రాముల వారి ఆశీర్వాదం పొంది రాముల వారికి సేవ చేయాలని నూతన కమిటీ, సభ్యులకు హితబోధ సేవ చేయాలని నూతన కమిటీ సభ్యులకు చేశారు. రామాలయానికి కొన్ని రోజుల క్రితం చిన్న జీయర్ స్వామి డిచ్‌పల్లి గ్రామానికి వచ్చారు. రామాలయానికి శిఖరం లేదన, రామాలయంపైకి రాకుండా పోవడం నాకు బాధకరమైందన్నారు.

వెంటనే ఈవిషయం ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లి ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంకు శిఖరం ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ఎమ్మెల్సీ కవిత ఇటీవల 10 రోజుల క్రితం రామాలయాన్ని సందర్శించి యాదాద్రి ఆలయంలాగా, శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయానికి పాటలకు సిద్దం చేద్దామని శిఖరం డిజైనర్లకు ఆదేశాలు వివిధ అంగుళా కొలతలు తీసుకొని వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గజవాడ జైపాల్, ఉప సర్పంచ్ రవి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శక్కర్ కొండ కృష్ణ, దండవుల సాయిలు, గ్రామ విడిసి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు సిబ్బంది, యువజన సంఘాల నాయకులు హమీర్, గిరి, జె. బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News