Wednesday, January 22, 2025

రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి రూరల్: రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మండలంలోని పాలితం రైతు వేదికలో పాలితం, నిట్టూరు, నిమ్మనపల్లి, తుర్కలమద్దికుంట, గోపయ్యపల్లి గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులను గోస పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

సకల సదుపాయాలు చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను అక్కున చేర్చుకోవాలని అన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చే పార్టీ కావాలా, మూడు గంటలు కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలో రైతులు నిర్ణయించుకోవాలన్నారు. మూడు పంటలకు నీరు, కరెంటు, ఎరువులు, రైతుబంధు అందిస్తున్న సీఎం కేసీఆర్ వైపు నిలబడి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ దాసరి చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, వైస్‌ఎంపీపీ రాజయ్య, సర్పంచ్‌లు పద్మ రవీందర్, దాతు మంజుల సదయ్య, జయప్రద సంజీవరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ రాజేశం, ఉపసర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతు సమితి గ్రామాల కోఆర్డినేటర్లు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News