Saturday, December 21, 2024

ఆ కాల్స్‌తో జర భద్రం

- Advertisement -
- Advertisement -

Those who record nude calls are making huge money

‘సార్‌” అంటూ వలపు వల

ఆ ట్రాప్‌లో పడ్డారో ఇక అంతే సంగతులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతోన్న వలపు వలలో చిక్కి కొందరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. న్యూడ్ కాల్‌‌స్ని తెలివిగా రికార్డ్ చేసే కిలాడీలు వాటిని అడ్డం పెట్టుకుని భారీగా డబ్బు గుంజుతున్నారు. దీంతో కొందరు అమాయకులు జేబు గుల్ల చేసుకుంటున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో గత కొన్ని రోజులు “ వలపు వల” బాధితులు ఎక్కువవుతున్నారు. విషయం ఎవరికీ చెప్పుకోలేక.. బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడుతూ లోలోపల కుమిలిపోతున్నారు నిస్సహాయులు. ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తల్లీకూతురి మాయలో చిక్కి ఆర్ధికంగా చితికిపోయాడు. తల్లీకూతురు నగ్నంగా వీడియో కాల్‌లో కనిపించి సదరు బాధితుడిని కూడా న్యూడ్‌గా మారాలని కోరడంతో అతను వారి మాటలు నమ్మి చెప్పినట్లు చేశాడు. అంతేకాకుండా డబ్బులు పంపమని వారు కోరినప్పుడల్లా పంపేవాడు. అలా వేల రూపాయలు పంపాడు. అయితే వీరి వేధింపులు ఎక్కువకావడంతో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా మాయలేడీ వలకు చిక్కి జేబు గుల్ల చేసుకున్నాడు.

వారం, పదిరోజుల పాటు పురుషులతో మాట్లాడిన మాయలేడీలు తమ దారిలోకి తెచ్చుకున్నారు. రోజూ ఒకటికి రెండు సార్లు వీడియో కాల్స్ చేస్తూ లైంగిక విషయాలపై ఓపెన్‌గా మాట్లాడేసరికి సదరు వ్యక్తులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు మామూలుగానే మాట్లాడే మహిళలు.. తర్వాత న్యూడ్‌గా మారుతూ వుండటంతో ఆ మైకంలో పురుషులు కూడా నగ్నంగా మారుతున్నారు. సరిగ్గా ఆ సమయం కోసం ఎదురుచూసే కిలాడీలు ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో చాలా మంది మగవాళ్లు ఆర్ధికంగా చితికిపోతున్నారు. ఇక రెండో రకం విషయానికి వస్తే అపరిచిత మహిళలు ఫోన్ చేసి తియ్యగా మాట్లాడతారు. రాంగ్ నెంబర్ అని మీరు చెప్పగానే సారీ చెబుతారు.

ఆ వెంటనే ఫోన్ పెట్టేస్తే ఓకే లేదంటే మాత్రం చిక్కుల్లో పడ్డట్లే. ఫోన్ పెట్టలేదో మీ పేరు, ఊరు, ఏం చేస్తారు అంటూ మాటలు కలుపుతారు. సహజంగానే అవతలివైపు ఆడవాళ్లు చనువుగా మాట్లాడితే. మగవాళ్లు తేలిగ్గా పడిపోతారు. బుట్టలోపడ్డవారితో రోజూ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడి టైం పాస్ చేసి ఆమె ఫోన్ కోసం ఎదురుచూసే స్థితికి తీసుకొస్తారు. దాదాపు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి ఈసారి నేరుగా వీడియో కాల్స్ చేస్తారు కిలాడీలు. అనంతరం నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి అబ్బాయిలకు పంపుతారు. అడిగినంత ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. కొందరు ఎంతోకొంత ఇచ్చి ఈ ముఠాలను వదిలించుకుంటే డబ్బులు ఇవ్వలేని వారిని మానసికంగా హింసిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News