Sunday, January 19, 2025

బిసి అయినా …దేశానికి డమ్మీ ప్రధాని

- Advertisement -
- Advertisement -

సిఎం అభ్యర్థి బిసిగా ప్రకటంచినా ఒరిగేదేముండదు
బిసిల వాటా దక్కేవరకు ఎవరినీ వదలం
బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

మన తెలంగాణ / హైదరాబాద్ : జనాభా దమాషా ప్రకారం బిసిలకు అన్ని రంగాలలో న్యాయమైన వాటా దక్కే వరకు తమ పోటారం కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కేంద్రంలో బిసి ప్రధాని అయినా ఆయన డమ్మీ అని వెనకనుండి ఆడించేది మరొకరని తీవ్ర ఆరోపణలు చేశారు. బిసి ప్రధాగా ఉండి ఆయన బిసిలకు ఒరగబెట్టిందేమి లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిసిని ప్రకటిస్తారన్న ప్రచారంపై కృష్ణయ్య స్పందించారు. ప్రధాని బిసి అయి ఉండి కూడా చట్టసభల్లో బిసి రిజర్వేషన్లు కల్పించలేదని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదని అన్నారు. తమకు కావాల్సింది. చట్టసభల్లో రిజర్వేషన్లు, బిసి మంత్రిత్వశాఖ, కేంద్ర స్థాయిలో బిసిలకు గురుకుల పాఠశాలల ఏర్పాటు, బిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్, ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్లు కల్పించడం లాంటి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

న్యాయపరంగా తమకు రావాల్సిన వాటా అడుగుతున్నామని ఆయనన్నారు. ఇవేమి ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం బిసిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. ప్రధాని, ముఖ్యమంత్రి బిసి అయినా బిసి విధానాలు అమలు కానిదే ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. బిసిల్లో చైతన్యం వచ్చిందని తమ హక్కుల కోసం, న్యాయమైన వాటా కోసం నిలదీస్తున్నారని ఆయనన్నారు. బిసిల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పర్యటించి బిసి మహోద్యమాన్ని నిర్మిస్తానని కృష్ణయ్య చెప్పారు. జనాభాలో సగభాగం కంటే ఎక్కువైన బిసిలకు ప్రదాన రాజకీయ పార్టీలన్నీ సీట్ల కేటాయింపులే అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టిల వలే బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే చట్టసభల్లో బిసి ప్రాతినిధ్యం పెరుగుతుందని, బిసిల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు.

బిసిల డిమాండ్లు పరిష్కరించకుండా బిజెపి ప్రభుత్వం ఎలాంటి హామిలిచ్చినా ప్రయోజనం ఉండదని, బిసిలు విశ్వసించరని కృష్ణయ్య స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లోనూ బిసి రిజర్వేషన్లు జనాభా కనుగుణంగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలన్నారు. మహిళా బిల్లు పెట్టి పాస్ చేయించుకున్న బిజెపి ప్రభుత్వం బిసి మహిళలకు సబ్‌కోటా ఎందుకు కల్పించలేదని, బిసిల పట్ల ఆ పార్టీకి ఇదేనా చిత్తశుద్ది అని ఆయన ప్రశ్నించారు. బిపి బిల్లు పాస్ అయ్యే వరకు ఊరుకునేది లేదని దేశంలోని బిసిలందరి మద్దతును కూడగట్టి మహోద్యమాన్ని నిర్మిస్తామని కృష్ణయ్య రాజకీయ పార్టీలకు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News