Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ పార్టీకి ఈసి బిగ్ షాక్!

- Advertisement -
- Advertisement -
స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు లేని పార్టీలకు కేటాయించిన 193 ఎన్నికల గుర్తుల జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల చిహ్నాల జాబితా నుంచి కార్ల గుర్తులను తొలగించాలని భారత రాష్ట్ర సమితి ఇటీవల భారత ఎన్నికల కమిషన్(ఈసిఐ)ని ఆశ్రయించింది. కారు గుర్తులను తొలగిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినప్పటికీ…మే 15న విడుదల చేసిన జాబితా బిఆర్‌ఎస్ నేతల్లో అయోమయం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు లేని పార్టీలకు కేటాయించిన 193 ఎన్నికల గుర్తుల జాబితాను ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది. బిఆర్‌ఎస్ నిరాశకు, కారు పోలికలున్న చిహాలు జాబితాలో చేర్చబడ్డాయి. ఇదివరకటి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కారు గుర్తుల సారూప్యత కారణంగా బిఆర్‌ఎస్ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నది.

ఎన్నికల చిహ్నాల జాబితాలో కారుకు సరిపోయే గుర్తులు ఉండడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లలో గందరగోళం ఏర్పడి పార్టీకి ఓట్లు గల్లంతయే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కారు పోలికల చిహ్నాల కారణంగా జరిగిన నష్టాల వివరాలను ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ వివరంగా సమర్పించాలనుకుంటోంది. అలాంటి చిహ్నాలను ఉపసంహరించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయనున్నది. ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు భరత్ కుమార్ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2011 నవంబర్‌లో జాబితా నుంచి రోడ్ రోలర్ గుర్తును తొలగించారని, అయితే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ తిరిగి ప్రవేశపెట్టారని బిఆర్‌ఎస్ నాయకుడు, ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టిఆర్‌ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఆటోరిక్షాలు,టోపి, ఇస్త్రీపెట్టె వంటి చిహ్నాలు జాబితా నుంచి తొలగించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో ఎన్నికల గుర్తు చిన్నగా కనిపిస్తుందని, తక్కువ వెలుతురు ఉన్న చోట ప్రజలకు కారు గుర్తును ఖచ్చితంగా గుర్తించడం కష్టమవుతుందని బిఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. కారు పోలిక చిహ్నాలను తొలగించడం వల్ల ఓటింగ్‌లో గందరగోళం తలెత్తకుండా స్పష్టత వస్తుందని నొక్కి చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News