- Advertisement -
హైదరాబాద్: ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. జలవిహార్‌లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృధా ఖర్చులు పెట్టొద్దని సూచించారు. గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా వంద అంబులెన్స్‌లు పంపిణీ చేశానన్నారు. ఈ ఏడాది వెయ్యి మోటార్ సైకిళ్లను దివ్యాంగులకు అందించామని, టిఆర్ఎస్ నేతలు స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నామన్నారు. త్రి చక్ర వాహనాలు దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతాయన్నారు.
- Advertisement -