న్యూఢిల్లీ : అమెరికాలో స్టూడెంట్ వీసాల కోసం భారతీయ విద్యార్థుల సందడి మొదలైంది. అమెరికా ఎంబస్సీ ప్రకటన మేరకు వీసా స్లాట్‌ల కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. జులై, ఆగస్టు నెలలో అమెరికా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో ఉన్నత చదువుల అవకాశాల కోసం వీసా అపాయింట్‌మెంట్లను పొందారని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఒ్కరు తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాలులేదా ఎఫ్ 1వీసాలు అందేలా చేసేందుకు యత్నిస్తామని , ఈ దిశలో భారత్‌లోని అమెరికా ఎంబసీ వర్గాలు కృషి చేస్తాయని దౌత్య ప్రతినిధి తెలిపారు. ఈ వీసాలతో వారు అమెరికాలో చట్టబద్ధమైన విద్యా సంవత్సర కాలాన్ని గడిపేందుకు వీలేర్పడుతుంది. ఈ నెల 14 నుంచే వేలాది మంది విద్యార్థులు వీసా ఇంటర్వూలకు స్లాట్స్ బుక్ చేసుకున్నారు. దశలవారిగా మరిన్ని వీసాల అపాయింట్‌మెంట్లకు వీలుంటుంది. వీసాలు పొందిన వారు అమెరికా ప్రయాణానికి ముందు తప్పనిసరిగా కొవిడ్ 19 రిపోర్టును అందచేయాల్సి ఉంటుంది.