Saturday, November 23, 2024

గోవా బీచ్‌లో చేపల సందడి

- Advertisement -
- Advertisement -

పెర్నెమ్ : గత కొద్దిరోజులుగా గోవా బీచ్ పరిసరాల్లో అత్యంత అరుదైన సార్డిన్ చేపలు కుప్పలుకుప్పలుగాతేలుతూ కన్పించాయి. తీరం వెంబడి ఇవి కలియతిరుగుతూ ఉండటం పర్యాటకులకు కనువిందు చేసింది. కొందరు వీటిని ఆహారానికి పట్టుకుని వెళ్లుతున్నారు. అత్యంత పోషక విలువలు ఉన్న చేపలుగా వీటికి పేరుంది. కెరి తెరెఖోల్ తీర ప్రాంతం పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో విస్తారితంగా ఉంటుంది. గోవా మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఈ తీరానికి ఎక్కువ మంది తరలివస్తుంటారు.

ప్రతిసాయంత్రం ఇవి తీర సమీపంలోని జలాల్లో కన్పిస్తున్నాయని, ఇది అత్యంత అరుదైన ఘటన అని ఇక్కడి జాలరి వామన్ నాయక్ తెలిపారు. దీనిపై సముద్ర ఉపరితల విషయాల జాతీయ సంస్థ సిఎస్‌ఐఆర్ మాజీ పరిశోధకులు డాక్టర్ బాబన్ ఇంగోల్ స్పందిస్తూ సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగితే సాయంత్రం వేళ ఈ చేపలు బయటకు వస్తుంటాయని చెప్పారు. వేడిమి నుంచి తమను తాము రక్షించుకునే ఈ పరిణామం సార్డిన్ రన్ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News