బ్రసెల్స్ : ఉక్రెయిన్‌కు రక్షణగా రష్యా, ఉక్రెయిన్ సమీపాన ఉన్న నాటో కూటమి దేశాలకు వేలాది బలగాలను పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్, నాటో కూటమి దేశాల నేతలు నిర్ణయించారు. ఈసందర్భంగా నాటో సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టాల్టెన్‌బెర్గ్ మాట్లాడుతూ నాటో రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌ఆర్‌ఎఫ్)మొత్తం 40,000 దళాల్లో కొన్ని దళాలను పంపుతున్నామని చెప్పారు. ఈ విధంగా నాటో కూటమి 30 దేశాలన్నీ సమష్టిగా ఉక్రెయిన్ రక్షణకు బలగాలను పంపడం మొదటిసారని తెలిపారు. నాటో కూటమికి చెందిన స్లొవొకియా దేశానికి పేట్రియట్ క్షిపణి నిరోధక వ్యవస్థతోపాటు బలగాలను పంపడానికి సిద్ధమౌతున్నామని జర్మనీ ప్రకటించింది. యుద్ధ సమూహంతో అత్యవసర సంప్రదింపులు జరిపై ప్రయత్నాల్లో స్లొవొకియా ఉంది. నావికా, వైమానిక దళాలతోపాటు అదనంగా 7640 సైనిక బలగాలను పంపడానికి అమెరికా, కెనడా నిర్ణయించడంపై యూరప్‌కు చెందిన నాటో సుప్రీం కమాండర్ , యుఎస్ జనరల్ టాడ్ డి.వోల్టర్స్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉక్రెయిన్‌కు రక్షణగా నాటో నుంచి వేలాది బలగాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -