Monday, December 23, 2024

రాధాకిషన్‌రావుపై బెదిరింపు కేసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డిసిసి రాధాకిషన్‌రావుకు కూకట్ పల్లి పోలీసులు షాక్ ఇచ్చారు. తాజాగా నమో దైన ప్లాట్ సెటిల్మెంట్‌లో భాగంగా సుదర్శన్‌ను బెదిరించిన కేసులో పోలీసులు ఆయనను ఎ-1 గా చేర్చారు. ఇక ఈ కేసులో విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదువుకుని, చట్టంపై అవగాహన ఉన్నా తనను రెండు సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా చేశాడని బాధితుడు సుదర్శన్ ఫిర్యాదు చేయడం కలకలం రేపిం ది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకుని ఇప్పుడు ధైర్యంగా బయటికి వచ్చి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు వె ల్లడించాడు. దీంతో రాధాకిషన్ రావు తన మాటలతో బాధితుడిని ఏ రేంజ్‌లో భయపెట్టాడో అ ర్థం చేసుకోవచ్చు. ‘నేను చెప్పినట్టు విను, లే దంటే నీ భాగస్వాములు చంపేస్తా రు, నేను చె ప్పినట్టు వినకపోతే కరోనా అంటించి చంపేస్తా, ఈ రాష్ట్రంలో నేనే బాస్, ఏ పోలీస్‌కు చెప్పుకుంటావో చెప్పుకో’ అం టూ రాధాకిషన్ రావు బెదిరింపులకు గురి చే శాడని

, ఇంకా అనేక గలీజు మాటలతో తిట్టడంతో పాటు టైర్‌తో కొట్టాడని బాధితుడు సుదర్శన్ కూకట్‌పల్లి పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదు సందర్బంగా వెల్లడించాడు. సుదర్శన్‌కు తన భాగస్వాములు ఎవికె రాజు, మరో వ్యక్తి రాజుల మ Rధ్య డబ్బుల గొడవలో రాధాకిషన్ ఎంట్రీ అయినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు అనుమతితో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ విచారణ పూర్తయినా తర్వాత కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న టా స్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు హైబీపీతో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఆయన హైబీపీతో ఇబ్బంది పడినట్లుగా తెలిసింది. ఈ నేప థ్యంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు రాధా కిషన్ రావును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసంపై దృ ష్టి సారించిన దర్యాప్తు బృందం ఆ దిశగా రా ధాకిషన్‌రావును ప్రశ్నిస్తోంది. ప్రణీతరావు తో కలిసి రాధాకిషన్‌రావు హార్ట్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు ఎస్‌ఐబి కార్యాల యంలోని మరిన్ని ఆధారాలు ధ్వంసం చేసిన ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనను మరింత లోతుగా విచా రిస్తున్నారు. అయితే రెండో రోజు రాధా కిష న్‌రావుకు బిపి పెరగడంతో పోలీసులు పోలీ స్ స్టేషన్‌కు వైద్యులను రప్పించారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైద్యులు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును తన కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవార నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ఆయనకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు తెలిపారు. అయితే, ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News