ముంబై: ‘గాయకుడు సిద్ధు మూసేవాలాకు పట్టిన గతే నీకు, నీ కుమారుడికి పడుతుంది’ అని హిందీలో ఎల్‌బి పేరుతో రాసిన లేఖను సలీమ్ ఖాన్ సెక్యూరిటీ టీమ్ కనుగొన్నారు. 2018లో కూడా సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ బెదిరిస్తూ లేఖ రాశాడని ఓ ఆరోపణ ఉంది. ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను పోలీసులు గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో విచారిస్తున్నారు. అందులో భాగంగా నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను బెదిరిస్తూ రాసిన లేఖపై కూడా విచారిస్తున్నారు. ఆ బెదిరింపు లేఖ వచ్చాక మహారాష్ట్ర హోం శాఖ సల్మాన్ ఖాన్‌కు సెక్యూరిటీని పెంచింది. ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను కూడా తెలియని వ్యక్తి పేరిట ఆదివారం దాఖలు చేశారు.
బాంద్రా పోలీసుల కథనం ప్రకారం ఆ బెదిరింపు లేఖ సలీమ్ ఖాన్ రోజు ఉదయం జాగింగ్ చేసి కూర్చునే బెంచి మీద ఆయన చూశారు. ఆ ప్రదేశం బాంద్రా బస్‌స్టాండ్‌కు దగ్గరలోనే ఉంటుంది. ఆ బెదిరింపు లేక సలీమ్ ఖాన్‌కు ఉదయం 7.30 నుంచి 8.00 గంటల మధ్య లభించింది. ఆ లేఖ అతడిని, అతడి కుమారుడు, నటుడు సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఉంది. నటుడు సల్మాన్ ఖాన్ దుబాయ్‌లో జరిగిన ఐఐఎఫ్‌ఎ అవార్డ్ 2022 కార్యక్రమానికి హాజరై ఆదివారమే ముంబైకి తిరిగొచ్చాడు. కాగా ఆయన సోదరులు సొహైల్, అర్బాజ్ ఖాన్ సోమవారం సల్మాన్ ఖాన్ ఇంటికి (గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్స్) వెళ్లి చూశారు. కాగా సల్మాన్ ఖాన్ తన సినిమా ‘కభీ ఈద్ కభీ దీపావళి’ అనే రాబేయే చిత్రంలో నటించేందుకు హైదరాబాద్ కు త్వరలో ప్రయాణించనున్నారని సమాచారం.