Wednesday, January 22, 2025

శామీర్ పేటలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని శామిర్ పేటలో జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్ పేటలోని మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. వైన్ షాపులో పనిచేస్తున్న జైపాల్ రెడ్డి , బాలకృష్ణ పై కర్రలతో దాడి చేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి గాల్లోకి కాల్పులు జరిపి రూ.2 లక్షలను దుండులు ఎత్తుకెళ్ళారు. వైన్ షాపులో పనిచేస్తున్న జైపాల్ గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. అంతర్ రాష్ర్ట దోపిడి దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News