Friday, December 20, 2024

ఎంఎల్ఎ రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. శ్రీరామనవమికి శోభాయాత్ర నిర్వహించద్దని, నిర్వహిస్తే చంపివేస్తామని ఫోన్‌లో బెదిరించారు. దీనిపై స్పందించిన రాజాసింగ్ ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని వారికి సవాల్ విసిరారు. తనకు 7199942827,4223532270 నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. గతంలో కూడా ఇలాగే బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో ఇలాగే బెదిరింపు కాల్స్ రావడంతో అప్పటి డిజిపి అంజనీకుమార్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. తనకు ఏ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయో ఆ నంబర్లను లేఖలో రాసి డిజిపి పంపించారు. తనను చంపుతామని పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News