Friday, November 22, 2024

బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్

- Advertisement -
- Advertisement -

Threatening calls are coming Says R Krishnaiah

ఫేస్‌బుక్‌లో నా ఫోన్ నెంబర్ పెట్టి రెచ్చగొడుతున్నారు
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
విచారణ చేపట్టాలని హోం మంత్రికి, డిజిపికి వినతి

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసి ఆర్‌ను తాను అభినందించినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టారని, దాంతో ఈ నెల 4, 5 తేదీల్లో రోజుకు సుమారు 800 ఫోన్లు వచ్చాయని తెలిపారు. ఈ ఫోన్ కాల్స్ వెనుక ఎవరున్నారో తేల్చాలని కోరుతూ శనివారం హోం మంత్రి మహమూద్ అలీకి, డిజిపి మహేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో బిసి బంధు ఎ ప్పుడు పెడుతారో ప్రశ్నించమని ఫోన్ నెంబర్ పెట్టి కొందరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని పే ర్కొన్నారు. ఇలా మాట్లాడే వారిలో భాగా ట్రైనింగ్ పొందిన వారు మాట్లాడుతున్నారని, 47 సంవ త్సరాలుగా ఉద్యమాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇలాం టి కుట్రలు ఎవరూ చేయలేదని అన్నారు. దీని వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉండి రెచ్చగోడుతున్నాయని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో జాతీయ బిసి సంక్షేమ సంఘం టిఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతు ఇచ్చిందని, ఈటల రాజేందర్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఫోన్లు చేసిన వారిలో కొందరు జనాభాలో కుల గణనపై సు ప్రీంకోర్టులో వేసిన కేసు వృథా అని,- చట్ట సభలలో బిసిలకు 50శాతం రిజర్వేషన్లకై ఇక్కడ ఉద్యమం చే యడం కాదు.. చేయాలని వాదించా రని చెప్పారు. ఒక పథకం ప్రకారం కొందరు రాజకీ య నాయకులు కిరాయి మనుషులతో మాట్లాడిస్తూ రెచ్చగొట్టే విధంగా దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది అని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఫేస్‌బు క్‌లో పోస్టులు పెట్టిన వారిని విచారిస్తే దీనికి మూల కారణం ఎవరు అనే విషయం0, ఇతర వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి, డిజిపిలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర బిసి బంధు ప్రవేశపెడతామని స్వయాన ము ఖ్యమంత్రే మూడు ప్రకటించారని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య గుర్తు చేశారు. ఇప్పటికీ మూడు సార్లు బి.సి, మైనార్టీతో పాటు అన్ని కులాల్లోని పేదలకు ఈ పథకాన్ని దశల వారీగా విస్తరిస్తామని, పేదవారం దరికీ ఇస్తామని సిఎం ప్రకటించారని పేర్కొన్నారు. బిసి బంధు కోసం బి.సి సంక్షేమ సంఘం అధ్వర్యం లో ధర్నాలు- ర్యాలీలు నిర్వహించామని, దీనికి స్పం దించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గొప్ప మనసు తో దశలవారీగా ‘బి.సి బందు’ పథకం పెడుతామని ప్రకటించారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News