Monday, December 23, 2024

చంపేస్తామంటూ ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోషామహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ కలకలం రేగింది. శ్రీరామనవమి శోభయాత్ర చేపడితే చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ లో హెచ్చరించారు. దీంతో దమ్ముంటే నేరుగా రావాలంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 7199942827, 42235322270 నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినట్లు రాజా సింగ్ తెలిపారు. గతంలోనూ రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News