Saturday, November 23, 2024

మీ అంతు చూస్తాం.. ఆ నలుగురు ఎంఎల్‌ఎలకు బెదిరింపు కాల్స్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయ త్నిం చగా దీనిని పథకం ప్రకారం బయటపెట్టిన ఎం ఎల్‌ఎలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ కేసులో బెదిరింపు కాల్స్ కలకలం రేపు తు న్నాయి. ఎంఎల్‌ఎల కొనుగోళ్ల వ్యవహారాన్ని బ యటపెట్టిన నలుగురు ఎంఎల్‌ఎలు ఫైలట్ రో హిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ వ్యవహారాన్ని బయటపెట్టినందుకు మీ అంతు చూస్తాం’ అంటూ ఉ త్తరప్రదేశ్, గుజరాత్ నుండి బెదిరింపు కాల్స్ వ స్తున్నాయని సదరు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఆరోపిస్తున్నారు.

బెదిరింపుల కాల్స్‌పై పోలీసులకు ఫి ర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని టిఆర్‌ఎస్ పార్టీ హైకమాండ్ దృష్టికి కూ డా తీసుకెళ్లారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఎం ఎల్‌ఎల భద్రతపై పోలీసులు అప్రమత్తం అయ్యా రు. ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న నలుగు రు ఎంఎల్‌ఎలకు ఇప్పటికే భద్రత పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొ దట ఒక ఎంఎల్‌ఎకు, ఆ తర్వాత మిగతా ముగ్గురికి భద్రత పెంచారు. వీరికి 24 గంటలూ 4+4 గన్‌మెన్‌లతో భద్రత కల్పించారు. కేవలం భద్రత పెంచడమే కాకుండా బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్స్ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎంఎల్‌ఎలు కొనుగోలు కేసులో విచారణలో వేగం పెంచారు. హైదరాబాద్ సిపి ఆనం ద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక బృందం నిందితులను అన్ని కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా విచారణ జరిగినట్లు సమాచారం. కేసులో నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించడంతో పోలీసులు ప్రశ్నించి వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించారు. నిందితులు సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, సోమయాజులు స్వామీజి, నంద కుమార్‌లను శుక్రవారం నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యోబోరేటరీకి తరలించి వాయిస్ టెస్ట్ నిర్వహించారు. పోలీసుల స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో రికార్డుల్లోని మాటలను నిందితుల వాయిస్‌తో పోల్చేందుకు ఈ పరీక్ష ఫలితం కీలకం కానుంది. టెస్ట్ రిజల్ట్ తర్వాత కేసు దర్యాప్తులో అధికారులు మరింత దూకుడు పెంచనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్రభారతి ఎంఎల్‌ఎలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు ఎంఎల్‌ఎలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తానన్నట్టు ఆడియోల్లో స్పష్టంగా మాట్లాడిన క్రమంలో ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే దానిపై పోలీసులు విచారణ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే.. కేసు విచారణ కీలక దశలో ఉండగా కేసులో భాగస్వామ్యులైన నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసు దర్యాప్తును ప్రభుత్వం గురువారం సిట్ చేతికి అప్పగించింది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ అధ్యక్షతన ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సివి ఆనంద్ తో పాటు మరో ఆరుగురు పోలీస్ అధికారులు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో నల్గొండ ఎస్‌పి రమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎసిపి గంగాధర్, మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డిలు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News