Monday, January 20, 2025

కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖలు: పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖలు వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నీ వ్యక్తిగత వీడియోలు బయటపెడతామంటూ సుదీప్‌కు కొందరు వ్యక్తులు బెదిరింపు లేఖలు రాసినట్లు పోలీసు వర్గాలు బుధవారం తెలిపాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా సుదీప్ ప్రచారం సాగించనున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖలు రావడం గమనార్హం.

బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దీన్ని ఉన్నత దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ మేనేజర్ జాక్ మంజు ఈ బెదిరింపు లేఖలు అందుకున్నారు. సుదీప్‌ను లేఖలో బూతులు తిట్టిన ఆ అజ్ఞాత వ్యక్తులు ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సుదీప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎవరో కుట్ర పన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి తన మద్దతును సుదీప్ త్వరలో ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News