Monday, December 23, 2024

కేంద్రమంత్రి గడ్కరీకి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

- Advertisement -
- Advertisement -

 

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సిటీలోగల ఆయన కార్యాలయానికి మొదటి ఫోన్‌ కాల్ వచ్చింది. ప్రాణహాని తలపెడతామని బెదిరించారు, ఆ తర్వాత 11.40 గంటల సమయంలో రెండో ఫోన్‌ కాల్‌ వచ్చింది. దాంతో నాగ్‌పూర్‌ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ కార్యాలయానికి రెండు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. దాంతో నాగ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కార్యాలయం వద్ద పోలీసు అధికారులు భద్రతను పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News