Monday, January 20, 2025

ముకేష్ అంబానీకి బెదిరింపు ఫోన్ కాల్స్

- Advertisement -
- Advertisement -

Threatening phone calls to Mukesh Ambani

ముంబైలో అనుమానితుడి అరెస్టు

ముంబై: ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి సోమవారం పలుమార్లు ఫోన్ చేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపివేస్తానంటూ బెదిరించాడు. అనంతరం.. ఒక అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిర్గావ్ ప్రాంతంలోని రిలయన్స్ ఆసుపత్రికి ఉదయం 10.30 ప్రాంతంలో మూడు నాలుగుసార్లు ఫోన్ చేసిన ఒక వ్యక్తి ముకేష్ అంబానీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు కాల్స్ సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన పోలీసులు దహిసర్ ప్రాంతంలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు కాల్స్‌పై డిబి మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News