Wednesday, January 22, 2025

టాలీవుడ్ నుంచి నన్ను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

- Advertisement -
- Advertisement -

తెలుగు సినిమాల నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘ ఆర్ఎక్స్100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆరోపించారు. గతంలో పాయల్ నటించిన రక్షణ అనే తెలుగు మూవీ.. ఇప్పుడు విడులయ్యేందుకు సిద్దమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ ఠాకూర్ నిర్మాతగానూ ఉన్నారు. ఈ సినిమాను జూన్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో పాయల్, మేకర్స్ మధ్య వివాదం నెలకొంది. ఈక్రమంలో పాయల్ తన ఎక్స్ ఖాతాలో ఈ వివాదం గురించి తెలిపింది

“2019లో రక్షణ అనే సినిమాలో నటించా. నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. రక్షణ సినిమాకు డిజిటల్ ప్రమోషన్ల కోసం నా టీమ్ వారితో చర్చించేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రమోషన్లకు రాలేనని నా టీమ్ వారికి చెప్పింది. రెమ్యూనరేషన్ బకాయిలు ముందుగా చెల్లించాలని కోరింది. అయితే, వారు దానికి అంగీకరించలేదు. ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రమోషన్స్ కు రాకపోతే, నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని వారు బెదిస్తున్నారు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరు వాడుతున్నారు. ఇది అసలు సరికాదు. ఈ మూవీలో నా పేరు, పాత్ర ఉంటే చట్టపరచర్యలు తీసుకుంటా” అని పాయల్ చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News