Monday, December 23, 2024

కోహ్లీపై సెటైర్లు.. అంబటి రాయుడి కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నట్లు అతని సన్నిహితుడు సామ్‌ పాల్ తెలిపారు. ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయుడు.. ఐపీఎల్ 2024 సీజన్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్రదర్శన, విరాట్ కోహ్లీపై విమర్శులు గుప్పించారు. ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ గెలవలేమని.. ప్లే ఆఫ్స్ చేరితేనే టైటిల్ గెలిచిందనే రీతిలో ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని రాయుడు సెటైర్లు వేశాడు. దీంతో ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ రాయుడిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.  రాయుడిపై ట్రోలింగ్‌కు దిగారు. జుగుప్సాకరమైన రీతిలో రాయుడిని బండ బూతులు తిడుతూ బెధిరింపులకు దిగారు.

ఈ క్రమంలో రాయుడి స్నేహితుడు సామ్‌ పాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రాయుడి కుటుంబంపై బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. కొందరైతే అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని, రాయుడి భార్యపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. భార్య, కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని చెప్పారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. అయితే, బెదిరింపులపై రాయుడు స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News