Wednesday, January 22, 2025

వ్యాపారవేత్తకు బెదిరింపులు: హిందూ మహాసభ కర్నాటక అధ్యక్షుని అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

 

బెంగళూరు: : డబ్బు, బంగారు నగలు ఇవ్వకపోతే చేతులు నరికివేయడంతోపాటు నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బయటపెడతానంటూ ఒక పారిశ్రామికవేత్తను బెదిరించిన హిందూ మహాసభ కర్నాటక అధ్యక్షుడు రాజేష్ పవిత్రన్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కావూరులో నివసించే సురేష్ అనే పారిశ్రామికవేత్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి పవిత్రన్‌ను అరెస్టు చేశారు. తన వ్యాపారంలో పవిత్రన్‌ను భాగస్వామిగా చేసుకోవాలని తొలుత సురేష్ బావించారు.

అయితే..పవిత్రన్ కార్యకలాపాలపై అనుమానం వచ్చి ఆ ప్రతిపాదనను ఆయన విరమించుకున్నాడు. దీంతో ఆగ్రహించిన పవిత్రన్ డబ్బు, బంగారం ఇవ్వాలని సురేష్‌ను బెదిరించడమేకాక ఆయన ల్యాప్‌టాప్‌ను కూడా లాక్కున్నాడు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే సురేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచుతానని పవిత్రన్ బెదిరించాడు. దీంతో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ సనిజ అని వ్యక్తిపై కూడా సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News