Wednesday, January 22, 2025

దాసోజు శ్రవణ్‌కు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ ఇంఛార్జి దాసోజు శ్రవణ్‌కి గురువారం అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అనుచరులం అంటూ కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఫోన్లో అసభ్య పదజాలం వాడుతూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై శ్రవణ్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్, సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపుల ఫై శ్రవణ్ మీడియా తో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత దిగజారుడుతనానికి పాల్పడుతున్నావు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భాష వినడానికి కూడా బాధ కలుగుతుందన్నారు. ఎవర్ని బడితే వాళ్ళను ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. నేను ఏమన్నా..నువ్వు ఏమాట్లాడుతున్నావు అని రేవంత్ రెడ్డిని శ్రవణ్ ప్రశ్నించారు.

నీకు బుద్ధిలేదా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే బిసి నాయకులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను నువ్వు ఏమన్నావో ఆ మాటలకు నీకు బుద్ధిలేదా అని అన్నాను.దానికి నువ్వు దొంగ కాల్స్ చేయించి మమ్మల్ని బెదిరిస్తావా..? బిసి నాయకులంటే పడతలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ఓ జాతిపిత లాంటివారన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడడుతూ రేవంత్‌రెడ్డి మరో నయీమ్ లెక్క మారాడన్నారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న ట్లు లేదు ఓ దండుపాళ్యం బ్యాచ్ నడుపుతున్నట్లు ఉందని శ్రవణ్ కన్నెర్రజేశారు. 95 శాతం బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టి పేద అన్ని కులాలకు చెందినటు వంటి రైతులు ఉండే ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్న పేద రైతులకు మూడు గంటలే పవర్ చాలని నువ్వు అమెరికా కు వెళ్లి అడ్డదిడ్డంగా మాట్లాడితే, అది తప్పు అని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు.

ఎందుకు ఇంత అక్కసు చిన్న, సన్నకారు రైతుల పట్ల నీకు ఎందుకు ఇంత కోపం? అని ప్రశ్నించారు. కెసిఆర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్న కారు రైతులు మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి పేద రైతులందరికీ అండగా ఉండి, వేలకోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి నీరు అందిస్తే, నీ కళ్ళలో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావ్ రేవంత్ రెడ్డి అని నిలదీశారు. కేసీఆర్ చిన్న సన్న కారు రైతులకు వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు బందు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇస్తే, నీ కళ్ళలో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావ్ రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.

నిత్యం కమిషన్లు కాంట్రక్టులంటూ తిరిగే నువ్వు.. కెసిఆర్ ఉచిత విద్యుత్ పంపిణీలో కమిషన్లకు పాల్పడుతున్నాడని అర్ధం పర్ధం లేకుండా ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఓ పక్క బిసిలపై కోపం, కెసిఆర్‌ఫై కోపం చిన్న సన్న కారు రైతులఫై కోపం ఇలా అందరిపై నీకు ఎందుకు కోపం? అని రేవంత్‌ను శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News