Saturday, November 23, 2024

ఫడ్నవీస్ భార్యకు బెదిరింపులు: డిజైనర్‌పై పోలీసు కేసు

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ఒక క్రిమినల్ కేసులో తన జోక్యాన్ని కోరుతూ కొటి రూపాయల లంచం ఇవ్వచూపడమేగాక తనను బెదిరించారని ఆరోపిస్తూ ఒక మహిళా డిజైనర్‌పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అమృత ఫడ్నవీస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనీక్ష అనే డిజైనర్‌తోపాటు ఆమె తండ్రిపై ఫిబ్రవరి 20న మలబార్ హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం అనీక్ష అనే డిజైనర్ గత 10 నెలలుగా అమృతను కలుస్తోంది. అమృతను ఆమె నివాసంలో కూడా ఆమె కలిసింది. వస్తువులు, జువెలరీ, ఫుటవేర్‌కు సంబంధించి తాను డిజైనర్‌నని, పబ్లిక్ ఈవెంట్స్‌లో వాటిని ధరించి తన వస్తువుల ప్రమోషన్‌కు తోడ్పడాలని అనీక్ష ఉప ముఖ్యమంత్రి భార్యను కోరినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తన తల్లి మరణించడంతో తన కుటుంబాన్ని తానే పోషిస్తున్నానని కూడా అనీక్ష చెప్పింది. అమృత నమ్మకాన్ని సంపాదించిన అనీక్ష కొందరు బుకీలకు సంబంధించిన సమాచారాన్ని అందచేస్తానని, దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చని అమృతకు తెలిపింది.
తన తండ్రిని ఒక కేసు నుంచి తప్పిండానికి ఒక కోటి రూపాయలు లంచంగా ఇస్తానని కూడా ఆమె చెప్పింది. అనీక్ష ప్రవర్తనతో మనస్తాపం చెందిన తాను ఆమె ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ చేసినట్లు అమృత పోలీసులకు తెలియచేశారు. దీంతో గుర్తు తెలియని నంబర్ నుంచి అమృతకు వీడియో క్లిప్స్, వాయిస్ నోట్స్, మెసేజెస్‌ను పంపించింది. అంతేగాక ఆమృత తండ్రి నేరుగా అమృతను ఫోన్‌లో బెదిరించాడని పోలీసు అధికారి చెప్పారు. అనీక్షతోపాటు ఆమె తండ్రిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News