Sunday, December 29, 2024

మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

ఇంటిని కూల్చిన వ్యక్తులు
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి బెదిరింపుల ఘటన రాజకీయంగా సంచలనం రేపుతుంది. అద్దెకు ఇచ్చిన ఇంటిని వ్యక్తులు కూల్చివేశారు. సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తో జూబ్లీహిల్స్‌లో ఇంటి లీజు వ్యవహారంలో ఏడాది క్రితం నుంచి తగాదాలు ఉన్నాయి. అయితే, జెసి తన ఇంటిని స్వాతిక్ కు అద్దెకు ఇవ్వగా సాత్విక్ అదే ఇంటిని జెసికి తెలియకుండా వేరొకరికి అద్దెకు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వ్యక్తులు జెసి ఇంటిని కూల్చివేసి వేరే నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జెసి దివాకర్ రెడ్డి, అతని మేనేజర్ జగదీష్ లు వారిని ప్రశ్నించగా.. రాజీవ్ సాల్మన్ అనే వ్యక్తి, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయమై జెసి దివాకర్ రెడ్డి, మేనేజర్ జగదీశ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News