Wednesday, January 22, 2025

డబ్బుల కోసం బెదిరించిన ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డబ్బులు ఇవ్వాలని ఎంఆర్‌ఎఫ్ టైర్ల డీలర్‌ను వేధించిన ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్తోల్, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, బండ్లగూడకు చెందిన ఫిరోజ్ ఖాన్ టైర్ల వ్యాపారం చేస్తున్నాడు, సాలంకి విట్టల్ రావు ఇద్దరు కలిసి బాధితుడిని డబ్బుల కోసం వేధించారు. టైర్ల వ్యాపారం చేస్తున్న ఫిరోజ్ ఖాన్‌కు వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. వాటిని పూడ్చుకునేందుకు బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు.

ఈ విషయం తనకు తెలిసిన విట్టల్ రావుకు చెప్పాడు. దానికి ఎంఆర్‌ఎఫ్ టైర్ డీలర్‌గా పనిచేస్తున్న మంద మోహన్ రెడ్డిని బెదిరించాలని ప్లాన్ వేశాడు. బాధితుడికి లైవ్ బుల్లెట్‌ను పంపించారు. తర్వాత నుంచి ఇంటర్‌నెట్ కాల్స్ చేస్తూ రూ.50లక్షలు ఇవ్వాలని లేకుంటే చంపివేస్తామని బెదిరించడం ప్రారంభించారు. ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు గురిచేయడంతో బాధితుడు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News