- Advertisement -
హైదరాబాద్: బంజారాహిల్స్ లో రూ 150 కోట్ల స్థలం కబ్జాకు యత్నించారు. భూమిని కబ్జా చేసేందుకుే జలమండలి విజిలెన్స్ హోం గార్డుకు బెదిరించారు. బోగస్ పత్రాలతో 1.20 ఎకరాల స్థలంలో ప్రవేశించేందుకు యత్నించారు. అడ్డుకున్న హోం గార్డుకు చంపేస్తామని బెదిరించారు. కబ్జాదారులు జలమండలి బోర్డు పీకేశారు. తట్టిఖానా సెక్షన్ జలమండలి మేనేజర్ రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జాకు ప్రయత్నిస్తున్న పి.పార్థసారథి అతడి అనుచరుల మీద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -