Sunday, December 22, 2024

రాజ్యసభకు ఆప్ నుంచి ముగ్గురు ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ అభ్యర్థులు సంజయ్ సింగ్, ఎన్‌డి గుప్తా, స్వాతి మలీవాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల కోసం వేరే ఇతర పార్టీల నుంచి ఏ అభ్యర్థీ నామినేషన్ పత్రం దాఖలు చేయలేదు. ‘ఆ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. శుక్రవారం వారికి సర్టిఫికేట్లు జారీ చేయడమైంది’

అని ఢిల్లీ సిఇఒ కార్యాలయంలో సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎంపిలను ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఈ నెల 19న జరగవలసిన రాజ్యసభ ఎన్నికల కోసం సంజయ్ సింగ్, గుప్తా, ఢిలీల మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ నెల 8న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News