Wednesday, January 22, 2025

సాయినాథ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గత నెల 22వ తేదీన హత్యకు గురైన సాయినాథ్ కేసును కుల్సుంపుర పోలీసులు ఛేదించారు. ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అంబర్‌పేటకు చెందిన జంగం సాయినాథ్ గ్లాస్ కటింగ్ షాప్‌లో పనిచేసేవాడు. తన అవసరం కోసం ఆకాష్ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

ఈ క్రమంలోనే ఆశాష్, సోను కలిసి సాయినాథ్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారు. అంతేకాకుండా స్థానికంగా తనకు గుర్తింపు రావాలని, అందరూ తనను చూసి భయపడాలని ఆకాష్ తరచూ స్నేహితులతో అనేవాడిని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News