Monday, December 23, 2024

చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్‌: ఐనవోలు దేవాలయం పరిసర ప్రాంతంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన దొంగతో పాటు ఈకేసు సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను ఐనవోలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 40 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.లక్ష 80 వేల నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఅరెస్ట్‌కు సంబంధించి డిసిపి కరుణాకర్ వివరాలు వెల్లడించారు.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి ప్రాంతానికి చెందిన నిందితులు ఎల్లబోయిన హరీష్, శోబోతు భిక్షపతి, యాదాద్రి జిల్లా బిబినగర్ ప్రాంతానికి గండు వసంతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా చోరీల సొత్తును స్వాధీనం చేసుకొని, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎసిపి నరేష్‌కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, ఐనవోలు ఎస్సై వెంకన్న, సిబ్బందిని డిసిపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News